Friday, May 24, 2013

ఈ రోజు వైశాఖ శుద్ధ చతుర్దశి నృసింహ జయంతి..

ప్రహ్లాదుని రక్షించి హిరణ్యకశిపుని గర్వాన్ని హరించటానికే హరి స్తంభంలో ఆవిర్భవించాడు. అదే నరసింహావతారం.
కొన్ని ఘడియలు మాత్రమే ఈ అవతార విజ్రుంభణ, ఉపసంహరణ. 'కలడో లేడో, అన్న సంశయానికి 'కలడు' అన్న నివృత్తి లబింపజేసిన అవతారమిది.

మనిషిలోని వీర్యత్వ, సింహంలోని వేట లక్షణం కలసి దుష్టశక్తిపై అద్భుత పరాక్రమాన్ని స్ఫురింపజేసి విజయాన్ని సాధించిన విలక్షణ రూపం నరసింహ రూపం. ఆయన ఉగ్ర మూర్తి అయినా ప్రహ్లాదుడి వంటి భక్తులకు ఆకర్షణీయమైన సుందరరూపమే. ఆగ్రహానుగ్రహాలు ఏకకాలంలో ప్రదర్శించిన అద్భుతావతారం. ఒకే సమయంలో నరసింహుడి నేత్రం నుంచి వెలువడిన కోపాగ్ని హిరణ్యకశిపుడి హృదయాన్ని భయకంపితం చేయగా, అదే కంటి నుంచి వెలువడిన దయావర్షం ప్రహ్లాదుడ్ని పులకాంకితున్ని చేసింది. అత్యద్భుతమైన ఆవేశావతారమిది.

విష్ణుమయము వేదంబులు
విష్ణుమయము సర్వమఖిల విజ్ఞానములున్
విష్ణుమయము జగమంతయు
విష్ణుమయము విష్ణుడొకడు వేద్యుడు బుద్ధిన్!

No comments:

Post a Comment

பிறப்புடன் பிறக்கும் ஐந்து விதிகள்...

ஒரு குழந்தை கர்ப்பத்தில் உண்டாகிறது. அதனுடன் ஐந்து விஷயங்கள் கூடவே பிறக்கின்றன.  (1) *ஆயுள்* : மனிதன் எவ்வளவு முயற்சி செய்தாலும் ஒரு நொடி க...