మహారాష్ట్రలో ఒక మారుమూల గ్రామమైన విజ్జదిత్ (జలగావ్) లో జన్మించిన అపర గణితశాస్త్రకోవిదుడైన భాస్కరాచార్యులు-2 తన ఆల్జీబ్రా, అర్థమెటిక్,జ్యామితి సాధనతో ప్రపంచ వ్యాప్తంగా గణితజ్ఞానాన్ని పంచారు. ఆయన కనిపెట్టిన "లీలావతి", "బీజగణిత" సిద్ధాంతాలు లేకుండా ప్రస్తుతం యే గణితం ముందుకు సాగదు. అందుకే ఆయనను "సిద్ధాంత శొరోమణి"గా పిలిచేవారు. ఖగోళ శాస్త్రంలో కూడా గ్రహాలమధ్య స్థానాలు, గ్రహణాలకు శులభతరమైన ఫార్ములాలతోపాటుగా ఖగోళయంత్రాలను సైతం తయారుచేసారు.
భూమ్యాకర్షణశక్తిగూర్చి న్యూటన్‌కంటే 500సంవత్సరాల ముందుగా ఈయనే "సూర్యసిద్ధాంతం" పేరుతో సూత్రీకరించారు. అందులో చెప్పిన వాక్యాలు :
" వస్తువులు నేలరాలడమనేది భూమియొక్క ఆకర్షణశక్తివల్లన జరుగుతుంది. చంద్రుడు, భూమి, ఇతర గ్రహాలు కూడా ఆకర్షణశక్తివల్లనే కక్ష్యలో తిరుగుతూంటాయి".
మధ్యయుగపు మహా గణితశాస్త్రవేత్తైన భాస్కరాచార్యుల గ్రంధాలమీద పరిశోధనలు చేసిన ప్రాశ్చాత్యులు ఎన్నోసిద్ధాంతాలను తమవిగా చెప్పుకొని పేరు పొందారు.సనాతనధర్మంలో దేవునిగురించేకాదు,మానవుని కి అవసరమైన అనేకమైనశాస్త్రాలను మనశాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. వారిని లెక్కపెట్టడానికి వేయి జీవితకాలాలైనా సరిపోవు.వారిలో కొందరైనవీరిగురించి అందరికీ తెలియజేయండి. భరతమాత సేవలో మీ మురళి
No comments:
Post a Comment