అద్భుత శిల్ప సౌందర్యానికి ప్రతీక డిచ్‌పల్లి రామాలయం
నిజామాబాద్ : తెలంగాణ ఎన్నో ప్రాచీన అద్భుత కట్టడాలకు నివానం. కాకతీయ రాజుల నిర్మాణ కౌశలం అందరిని అబ్బురపరుస్తుంది. అలాంటి నిర్మాణాల్లో ఒకటైన డిచ్‌పల్లి శ్రీ రామాలయాన్ని తెలంగాణ ఖజురహోగా కీర్తిస్తారు . ఖిలా రామాలయంగానూ పిలిచే ఈ గుడిని 14వ శతాబ్దంలో కాకతీయ రాజులు నిజామాబాద్ జిల్లాలో నిర్మించారు. ఈ ఆలయానికి 105 మెట్లతో కాలి నడక మార్గం మాత్రమే ఉంది. ఆలయ ప్రాకారం, స్తంభాలు, పై కప్పు మీద దేవతలు, రాక్షస, జంతువుల శిల్పాలు మనకు కనిపిస్తాయి. ఖజురహో లాంటి శిల్ప సౌందర్యాన్ని ఈ ఆలయంలో చూడొచ్చు. సీత, లక్ష్మణ, ఆంజనేయ సమేతుడైన శ్రీరామచంద్రుడు మనకు దర్శనం ఇస్తారు. ఈ విగ్రహాన్ని రాజా గజపద చన్నయ్య ఆలయానికి బహుకరించారు. ఆలయానికి కూతవేటు దూరంలో ఇందూర్ కోట ఉంది. ఇక్కడి జైలులోనే తెలంగాణ ప్రముఖ కవి దాశరధి కృష్ణమాచార్యను నిజాం రాజు ఖైదు చేసింది. “నా తెలంగాణ కోటి రతనాల వీణ” ని ఆయన రాసింది ఇక్కడే. నిజామాబాద్ నుండి ఈ ఆలయం 11 కిలోమీటర్ల దూరంలో
No comments:
Post a Comment